మొక్కలు నాటిన మణుగూరు మేజిస్ట్రేట్..

481
manuguru green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా పినపాక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పినపాక నియోజకవర్గంలో మొదలు పెట్టినటువంటి గ్రీన్ ఛాలెంజ్‌ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలను వలసిందిగా యువజన విభాగానికి సూచించడం జరిగింది.

అయితే అందులో భాగంగా ఈ రోజు మణుగూరు కోర్టు ఆవరణలో మణుగూరు మేజిస్ట్రేట్ ఎన్‌ శ్యామ్ సుందర్ సహకారంతో మూడు మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ పూర్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో “రేగా సైన్యం” సభ్యులు రాజేష్, హరి, నరేందర్, దీపక్, ప్రవీణ్ మరియు కోర్టు సిబ్బంది హోంగార్డు కళ్యాణ్, నారాయణ గౌడ్ పాల్గొనడం జరిగినది.

green challenge

- Advertisement -