మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితసేనలో భాగంగా ఈ రోజు కీసర గుట్ట పరిధిలోని VR SERENITY ACADEMIA స్కూల్ లో హరితసేన మహిళా విభాగం అధ్యక్షులు మాధురి ఆధ్వర్యంలో చిన్న పిల్లలతో కలిసి మామిడి, వేప, చింత మొక్కలు నాటిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్ ..
ఈ సందర్భంగా చిన్న చిన్న పిల్లలతో కలిసి మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందనీ అన్నారు. ఉగాది నూతన సంవత్సరం మొదలు అవుతున్న సందర్బంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ప్రకృతి విలయాల నుండి తప్పుంచు కోవాలంటే తప్పకుండ ప్రకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అన్నారు.

మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలి అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మొదలు పెట్టి అందరిని భాగస్వామ్యం చేస్తున్న మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి రాఘవేందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో స్కూల్ యాజమాన్యం పిన్నింటి రాజిరెడ్డి , హరిత సేన సభ్యులు అమృత్ లాల్ చౌహన్, గర్రెపల్లి సతీష్, జగన్ మోహన్ పండాల, భోజనారాయణ , పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Also Read:మ్యాడ్ స్క్వేర్.. వసూళ్లు అదుర్స్!

