ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ తరఫున చర్లపల్లి ఓపెన్ జైల్ నందు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు హైదరాబాద్ రేంజ్ డీఐజీ Dr శ్రీనివాస్.
Green India Challenge యొక్క ఉద్దేశ్యాలను వివరిస్తూ భవిష్యత్ తరాలకు మేలు చేసేలా మరియు నేలతల్లి రుణాన్ని తీర్చుకునే గొప్ప అవకాశం ఇది అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే గొప్ప సంకల్పంతో Green India Challenge కార్యక్రమం ను ముందుకు తీసుకెళ్తూ అందరిలో స్ఫూర్తి రగిలిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.
గ్రీన్ చాలెంజ్‌లో చర్లపల్లి సెంట్రల్ జైలు సిబ్బంది, ఓపెన్ జైల్ చర్లపల్లి సిబ్బంది 150 మంది మరియు 50 మంది ముద్దాయిలు కలసి ఒక్కొక్కరు 5 మొక్కల చొప్పున మొత్తం 1000 మొక్కలను నాటారు. వీటిని సంరక్షించేందుకు 5 టీమ్ లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి జైల్ SP సంతోష్ కుమార్ రాయ్, ఓపెన్ జైల్ చర్లపల్లి SP కలాసాగర్, చంచల్ గూడ జైలు SP శివకుమార్ గౌడ్, మహిళా జైల్ సూపరింటెండెంట్ వెంకట లక్ష్మి, రంగా రెడ్డి జిల్లా సబ్ జైల్ ఆఫీసర్ రాంచంద్రం, చర్లపల్లి జైలు అధికారులు కృష్ణమూర్తి, శశికాంత్, ఆనంద్ రావు, పరుశరామ్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Also Read:పిక్ టాక్:ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అందాలు