GIC:8వ ఎడిషన్ ప్రారంభం

11
- Advertisement -

ఏడు వసంతాలుగా విజయవంతంగా ముందుకు వెళుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది.భారతదేశాన్ని పచ్చదనంతో నింపాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.ఒకరు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి చాలెంజ్ విసిరి మూడు మొక్కలు నాటాల్సిందిగా చాలెంజ్ విసరగా అది నేడు 20 కోట్లకు పైగా మొక్కలు నాటిన బృహత్కర కార్యక్రమం అయింది. సామాన్యుల నుండి సినీ ప్రముఖులు, రాజకీయాలకతీతంగా , కవులు, కళాకారులు ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఒక యజ్ఞంలా కొనసాగుతుంది..

గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది.మొదట సంతోష్ కుమార్ మాజీ మంత్రి మల్లారెడ్డి తో కలసి రామలింగేశ్వర స్వామి నీ దర్శించుకున్నారు అనంతరం ఆలయ పూజారులు వేద ఆశీర్వచనాలు అందించారు.అనంతరం కీసర గుట్ట పై మాజీ మంత్రి మల్లారెడ్డి తో కలిసి మొక్కలు నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్ 8 వ ఎడిషన్ ప్రారంభించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ లోగో ఆవిష్కరించారు..

ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ గారి స్పూర్తితో ఈ యజ్ఞం ప్రారంభించానని అన్నారు.నా జీవితాంతం కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించానని అన్నారు.కీసర ఫారెస్ట్ దత్తత తీసుకున్నాను దాని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు.ఏడు సంవత్సరాలుగా ఇరవై కోట్లకు పైగా మొక్కలు నాటడం జరిగిందని అందరి ఆశీర్వాదంతో, అందరి మద్దతుతో ఇది సాధ్యమయిందని అన్నారు.దిన్ని ఇలానే ముందుకు కొనసాగించాలని మీ అందరి సపోర్ట్ కావాలని ఆశించారు.ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటండి అకేషన్ ఏదైనా పుట్టిరోజు, పెళ్ళి రోజు, పెద్దల యాదిలో గాని మూడు మొక్కలు నాటి దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.ఇది అందరి అవసరం ఖచ్చితంగా అందరము దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు..

అనంతరం మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..సంతన్న అంటేనే హరితహారం, సంతన్న అంటే గ్రీన్ ఇండియా చాలెంజ్ అని అన్నారు.పచ్చని చెట్లు చూస్తే సంతోషంగా ఉంటుందనీ గ్రీన్ ఇండియా చాలెంజ్ 7 వసంతాలు పూర్తి చేసుకుంది ఎనిమిదవ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.గ్రీన్ ఇండియా చాలెంజ్  ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది..ఈ కార్యక్రమం ద్వారా 20 కోట్ల పైగా మొక్కలు నాటారు ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని కోరారు.  గ్రీన్ ఇండియా చాలెంజ్ కి అనేక అవార్డులు వచ్చాయి.పార్లమెంట్ లో కూడా సంతోష్ కుమార్ ప్రశంసలు అందుకున్నారని ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు సంతోష్ కుమార్ కి అభినందలు తెలిపారు.ఆ కీసర రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్లాలని ఆశించారు..

ఈ కార్యక్రమంలో కీసర మాజీ సర్పంచ్ మాధురీ వెంకటేష్, మాజీ బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి,రజినీ సాయి చంద్, సుమిత్రానంద్ తనోబా, హరిత సేన రాష్ట్ర కో ఆర్డినేటర్ సతీష్, రాజు, డాక్టర్ మార్కండేయులు, మాజీ మేయర్ మేకల కావ్య, బీ ఆర్ ఎస్ శ్రేణులు పాల్గొన్నారు…

- Advertisement -