రైతుల పక్షానే ఉంటా:గ్రేటా థన్ బర్గ్

333
greata
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 72 రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించగా తాజాగా స్వీడన్‌ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ మద్దతు ప్రకటించింది. దీంతో గ్రేటాపై నేరపూరిత కుట్ర, వర్గాల మధ్య ద్వేషాన్ని ప్రేరిపిస్తున్నారంటూ అభియోగాలు మోపుతూ కేసు నమోదుచేశారు ఢిల్లీ పోలీసులు.

ఈ నేపథ్యంలో మరోసారి స్పందించారు గ్రేటా థన్ బర్గ్. తానిప్పటికీ రైతుల పక్షాన నిలబడి ఉన్నానని, నిరసనకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. బెదిరింపులు తన నిర్ణయాన్ని మార్చలేవంటూ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.అలాగే స్టాండ్ విత్‌ ఫార్మర్స్‌, ఫార్మర్స్‌ ప్రొటెస్ట్‌ వంటి హ్యాష్‌ ట్యాగ్‌లనూ షేర్ చేశారు.

- Advertisement -