- Advertisement -
మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ శుక్రవారం కొలంబోకు చేరుకున్నారు. మోడీకి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీకి త్రివిధ దళాలు గౌరవ వందనం చేశాయి. ఇవాళ శ్రీలంక అధ్యక్షుడు, భారత ప్రధాని మోడీ ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనున్నారు.
రక్షణ, డిజిటల్, ఇంధన భద్రత తదితర రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పర్యటనలో భాగంగా భారత సహకారంతో నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. శాంపూర్ సౌరశక్తి ప్రాజెక్టు స్థలాన్ని సందర్శిస్తారు. 6న మోదీ దిస్సనాయకేతో కలిసి అనురాధపురాలోని మహాబోధి ఆలయాన్ని సందర్శిస్తారు.
Also Read:SSMB29:పాస్ పోర్ట్ వెనక్కి ఇచ్చేసిన మహేష్!
- Advertisement -

