దావోస్‌లో గ్రాండ్ ఇండియన్ పెవిలియన్

1
- Advertisement -

వరల్డ్ ఎకనమిక్ ఫోరం (wef) సదస్సులో భాగంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన ‘గ్రాండ్ ఇండియన్ పెవీలియన్‌’ను కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దావోస్‌లో తొలి రోజున జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎంతో పాటు కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జయంత్, మంత్రి శ్రీధర్ బాబు, కేరళ మంత్రి రాజీవ్ తో పాటు ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు. శ్రీ రేవంత్ రెడ్డి గారి సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఆగ్రో ప్రాసెసింగ్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ రంగానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని గుర్తుచేశారు. ‘ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ’ లక్ష్య సాధనలో తెలంగాణ రాష్ట్రం 1 ట్రిలియన్ అర్థిక వ్యవస్థగా భాగస్వామ్యం కావాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అని స్పష్టం చేశారు.

Also Read:గ్రామ సభ..అధికారులను నిలదీస్తున్న ప్రజలు

- Advertisement -