పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌..

259
students
- Advertisement -

కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండానేపై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.మే 7వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో తరగతులు నిర్వహించే అవకాశం లేదు. ఇప్పటికే తరగతులు, పరీక్షలు నిర్వహించాల్సిన సమయం కూడా దాటడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -