Harishrao:కొడంగల్‌లో మూతపడ్డ ప్రభుత్వ స్కూల్‌..సిగ్గుచేటు

3
- Advertisement -

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఉపాధ్యాయులు లేక పాఠశాల మూతపడటం సిగ్గుచేటు అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. 15 రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు మూతపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు.

విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ విద్య పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు? ,తక్షణమే పాఠశాలల్లో విద్యా వాలంటీర్లు నియమించి పాఠశాలను మూతపడకుండా చూడాలని, మూతపడ్డ పాఠశాలలను తెరిపించి విద్యా బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Also Read:డెంగ్యూ బాధితుల్లో ఫ్లాస్మా లీకేజీ..జాగ్రత్త వహించకుంటే!

- Advertisement -