వీసా నిబంధనలు సడలించిన కేంద్రం.

204
visa
- Advertisement -

వీసా నిబంధనలను సడలించింది కేంద్రం. విదేశాల నుంచి వచ్చేవారికి, విదేశాలకు వెళ్లే వారికి దశల వారీగా మినహాయింపులు ఇచ్చింది. టూరిస్ట్ వీసా మినహా అన్ని వర్గాల వారి ప్రయాణానికి అనుమతులు ఇచ్చింది.

వందే భారత్ మిషన్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్ లేదా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతించిన ఏ షెడ్యూల్ కాని వాణిజ్య విమానాల ద్వారా ప్రయాణికులకు అనుమతి ఇవ్వనున్నారు. ఇలా వచ్చే వారు, వెళ్లే వారు భారత ఆరోగ్య శాఖ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కేంద్రం తెలిపింది.

మెడికల్, టూరిస్ట్, ఎలక్ట్రానిక్ వీసాలు మినహా మిగిలిన అన్ని రకాల వీసా సేవలు దశల వారీగా పునరుద్ధరణ చేపడాతమన్నారు. వీసాల చెల్లుబాటు గడువు ముగిసినట్లయితే, ఆయా వర్గాల తాజా వీసాలను సంబంధిత ఇండియన్ మిషన్ లేదా పోస్టుల నుండి పొందవచ్చన్నారు.ఈ నిర్ణయంతో విదేశీ పౌరులు వ్యాపారం, సమావేశాలు, ఉపాధి, అధ్యయనాలు, పరిశోధన, వైద్యం వంటి వివిధ ప్రయోజనాల కోసం భారతదేశానికి రావడానికి వీలు కల్పిస్తుందన్నారు.

- Advertisement -