తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చింది. ఇక నుంచి తొమ్మిది పదో తరగతి పరీక్షల విధానంలో మార్పులు చేసింది. ఇక నుంచి ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
2022-23 నుంచి ఈ సంస్కరణలు అమలులోకి వస్తున్నట్టు పేర్కొన్నది. ఇక నుంచి ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80మార్కులు, ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌కు 20మార్కులు కేటాయించింది. సైన్స్ పేపర్‌లోని బయాలజీ ఫిజిక్స్‌లకు సగం సగం మార్కులు కేటాయించింది.
గతంలో తెలుగు ఇంగ్లీష్ గణితం సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రం సబ్జెక్టులు రెండు పేపర్లుగా ఉండగా…హిందీ మాత్రమే ఒక పేపర్‌గా ఉండేవి. దీంతో ఈ పేపర్ల సంఖ్యను ఆరుగా కుదించారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో పదవ వార్షీక పరీక్షలకు 11పేపర్లకు గాను ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి…