ముంపు ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది- కేటీఆర్‌

275
minister ktr
- Advertisement -

ముంపు ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రభుత్వం తక్షణ సాయంగా ముఖ్యమంత్రి కే .చంద్రశేఖరరావు ప్రకటించిన పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ రోజు మంత్రి కే. తారకరామారావు పలువురికి అందించారు. ఖైరతాబాద్ లోని ఎమ్మెస్ మక్త తోపాటు షేక్ పేట, నదీమ్ కాలనీ, నాగోల్, లింగోజిగూడాలో వరద ముంపు ప్రభావానికి గురైన పలు కుటుంబాలను పరిశీలించి, వారితో మాట్లాడి వారికి తక్షణ సాయంగా ప్రభుత్వం తరఫున పదివేల రూపాయల నగదును మంత్రి కేటీఆర్ అందించారు. ఈ సందర్భంగా ముంపుకు గురైన పలు కుంటుంబాలను మంత్రి పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందిస్తున్న పదివేల సహాయం తాత్కాలిక, తక్షణ సహాయం మాత్రమే అని, వరదల్లో ఇళ్లు పాక్షికంగా, లేదా పూర్తిగా నష్టపోతే వారికి మరింత సహాయం అందిస్తామని తెలిపారు. నగరంలో ఏంత మంది భాదితులు ఉంటే అంత మందికి సహాయం అందించాలని ముఖ్యమంత్రి అదేశాల మేరకు నగరంలో ఈరోజు అనేక చోట్ల నగదు సహాయం అందిస్తున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు హైదరాబాద్, పరిసరాల్లో వరద బాధిత ప్రాంతాల్లోని 3-4 లక్షల కుటుంబాలకు ఈరోజు నుండి రు.10,000 చొప్పున రాష్ట్ర మునిసిపల్ శాఖ ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు. బాధిత కుటుంబాలకు వారి ఇంటివద్దనే ఈ ఆర్థిక సహాయం అందజేస్తామన్నకేటీఆర్‌, అవసరమైతే ఈ సహాయం ఇంకా పెంచడానికి కూడా సిద్ధమని, వర్షాల వల్ల ఇబ్బందిపడ్డ ప్రతి వ్యక్తికి,కుటుంబానికి ఈ సాయం అందాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారని తెలిపారు. ఈ విపత్కర సమయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లు, ఎన్జీవోలు కలిసికట్టుగా ప్రజలకు సాయం అందేటట్టు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సహాయాన్ని స్వయంగా అందించి భరోసా నింపేందుకు కాలనీల్లో పర్యటిస్తున్నామని మంత్రి కెటియార్ వారికి తెలిపారు. రానున్న ఒకటి రెండు రోజుల పాటు మరిన్ని వర్షాలు కురిసేందుకు అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో వరద నివారణకు పలువురు నాలాల నిర్మాణం వంటి శాశ్వత పరిష్కారాల కోసం ప్రయత్నం చేస్తామని హమీ ఇచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఏంఏల్యేలు దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు లు మంత్రి వెంట ఉన్నారు.

- Advertisement -