నాగోల్‌లో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన కేటీఆర్…

90
ktr minister

హైదరాబాద్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో తక్షణ సహాయక చర్యల్లో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం, నాగోల్ అయ్యప్ప నగర్‌లోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు మంత్రి కేటీఆర్. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,కార్పోరేటర్‌,తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వరద నివారణకు తీసుకోవాల్సిన శాశ్వత చర్యల కోసం ఎన్ని డబ్బులు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావానికి గురైన ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటింటికి వచ్చి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు.