అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడగింపు..

184
international flights
- Advertisement -

డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. కార్గో విమానాలను ఎటువంటి షరతులు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీసీఏ సంయుక్త డీజీ సునీల్‌ కుమార్‌ సర్క్యులర్‌ను జారీ చేశారు.

ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలను పరిస్థితులను బట్టి సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. రోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తారనుకున్న సమయంలో యూకేలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌తో మళ్లీ నిషేధం అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు 165 మంది దేశంలో యూకే కరోనా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు.

- Advertisement -