బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రపతికి వ్యతిరేకం కాదని బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ఉంటుందని…కేంద్రం తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంట్‌లో ఎండగడాతమన్నారు.
ఆఖిల పక్ష సమావేశంలోనూ మా వైఖరిని స్పష్టంగా పేర్కొన్నామని అన్నారు. గవర్నర్ల అధికార దుర్వినియోగంపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. మరియు అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామని కేకే అన్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో నిన్న జరిగిన సమావేశానికి బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంట్‌లో ఎండగట్టాలని, అందుకు కలిసివచ్చే పార్టీలతో సమిష్టి వ్యూహాన్ని అనుసరించాలని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామన్నారు.
దేశ సమాఖ్య వ్యవస్థపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని బీఆర్‌ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా గవర్నర్‌లపై చర్చ జరగాలని డిమాండ్ చేయనున్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి…