రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళి సై.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని చెప్పారు. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారని తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని వెల్లడించారు. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పారు. తెలంగాణకు విశిష్టమైన చరిత్ర ఉన్నదని చెప్పారు.
హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతుందని.. వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ ఉందన్నారు.
అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినీ గేయరచయిత చంద్రబోస్, బాలలత, ఆకుల శ్రీజతోపాటు పలువురిని గవర్నర్ తమిళిసై సన్మానించారు.
ఇవి కూడా చదవండి..