రాజ్ భవన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ తమిళి సై బతుకమ్మ వేడుకల్లో పాల్గోన్నారు. అనంతరం పలువురు మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా గవర్నరు తమిళసై సౌందరరాజన్ తెలుగులో తెలంగాణాలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
బతుకమ్మ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 5వ తేదీ వరకు రాజ్‌భవన్‌లో ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ వెల్లడించారు.
బతుకమ్మ సంబురాలను రాజభవన్ ప్రాంగణంలో నేడు ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా గవర్నరు తమిళసై సౌందరరాజన్ తెలుగులో తెలంగాణాలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. pic.twitter.com/k9aiqW3i2K
— IPRDepartment (@IPRTelangana) September 30, 2019