వ్యాక్సిన్‌తోనే కరోనాకు చెక్‌: గవర్నర్

63
tamilisai

వ్యాక్సిన్ తోనే శాశ్వత రక్షణ ఉంటుందని…కరోనాను కట్టడి చేయగలుగుతామని వెల్లడించారు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు సంబంధించిన ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన గవర్నర్…. రెడ్డీస్ లేబొరేటరీస్ నుండి వస్తున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ దిగుమతి, మన దేశంలో తయారీ, పంపిణీ ఇలాంటి పలు అంశాలను చర్చించారు.

వ్యాక్సిన్ తయారీదారులు అన్ని రకాల చర్యలతో ఉత్పత్తిని వేగవంతం చేయాలని గవర్నర్ సూచించారు. ప్రధాని ఆత్మ నిర్బర్ భారత్ ఆశయానికి అనుగుణంగా ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రతినిధులు తాము ఈ జూలై నెల ఆఖరి వరకు దాదాపు రెండు కోట్ల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసులు దిగుమతి చేసుకుంటామని గవర్నర్ కు తెలిపారు.