విద్యుత్‌ పొదుపుకు ప్రతీ ఒక్కరు ఆలోచించాలి- గవర్నర్‌

109
- Advertisement -

ఆదివారం హైటెక్స్ లో తెలంగాణ స్టేట్ రినవేబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టీఎస్ఈసిఎ 2021 అవార్డులు ప్రదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ హాజరైయ్యారు. వారితో పాటు ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ రెడ్కో చైర్మన్,విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. విద్యుత్ పొదుపు చేసి అవార్డ్ అందుకుంటున్న వారికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే దేశంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం. వ్యవసాయ రంగానికి కూడా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం అన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.. గత మార్చి లో 13680 మెగా వాట్స్ పిక్ డిమాండ్ ను అధిగమించం. పర్ క్యాపిటల్‌ వినియోగంలో నంబర్ వన్‌గా రాష్ట్ర విద్యుత్ సంస్థ నిలిచింది. ఇన్నోవేటివ్‌గా విద్యుత్ పొదుపు కోసం 400 పై భవనాలను ఏర్పటు చేశాం. ప్రభుత్వం కూడా విద్యుత్ పొదుపు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఎలక్ట్రానిక్ పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యుత్ వాహనాల వినియోగం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. టీఎస్ రేడ్కో కు అభినందనలు తెలిపారు.

సునీల్ శర్మ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వ్యవసాయ రంగంకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాము.ఇదంత సీఎం కేసీఆర్ మార్గదర్శకాలతోనే సాధ్యం అవుతుంది. విద్యుత్ శాఖను ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ముందు ఉండి నడిపిస్తున్నారు.సీఎండీ ప్రభాకర్ ఎఫర్ట్‌ తోనే ఇవాళ విద్యుత్ నిరంతరం సరఫరా సాధ్యం అవుతుంది. ఎలక్ట్రానిక్ వాహనాలు పెరుగుతున్నాయి.రెడ్కో ఆధ్వర్యంలో విద్యుత్ వాహనాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. సోలార్‌లో కూడా రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఈ సంవత్సరం 700 ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.డిమాండ్ ఉంటే మరిన్ని ఏర్పటుకు ప్లాన్ చేస్తామన్నారు. గ్రామాల్లో ఎల్ఇడి బల్బ్ ను ఏర్పాటు చేశాము. మున్సిపాలిటీ లలో కూడా ఏర్పాటు చేశాం దీనితో విద్యుత్ పొదుపు అవుతుంది. తెలంగాణ సోలార్ పాలసీ ని 2015లో ఏర్పాటు చేశాం. ఎలక్ట్రానిక్ పాలసీలో భాగంగా విద్యుత్ వాహనాల కు 35 కోట్ల సబ్సిడీ ఇచ్చామని తెలిపారు.

గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ మాట్లాడుతూ.. హరిత తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. గ్రీన్ పవర్ కోసం సోలార్ పాలసి ఏర్పాటు చేశారు. సోలార్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ముందుంది. గ్రీన్ ఎనర్జీ కోసం,విద్యుత్ పొదుపు కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇంట్లో పిల్లలకు కూడా విద్యుత్ ఆదాపై అవగాహన కల్పించాలి. తెలంగాణ ప్రభుత్వం ఎల్ ఈ డి బల్బు లను ఏర్పాటు చేస్తోంది. ప్రధాన మంత్రి కూడా ఎల్ ఈ డి బల్బ్ లపై అనేక సార్లు చెప్తున్నారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని గవర్నర్‌ సూచించారు.

అవార్డులు..

ఎన్టీపీసీ
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (పరిశ్రమలు)
గోల్డ్ అవార్డ్ ఓరియంట్ సిమెంట్ (పరిశ్రమ)
గోల్డ్ అవార్డ్ ఐటీసీ కాకతీయ హోటల్ (కమర్షియల్ బిల్డింగ్)
(ప్రభుత్వ రంగ భవనాలు) సిల్వర్ అవార్డ్ డాక్ సదన్ పోస్టల్ డిపార్ట్మెంట్
గోల్డ్ అవార్డ్ హైదరాబాద్ పోస్టల్ భవన్ జనరల్ పోస్టాఫీస్
ఎడ్యుకేషన్ బిల్డింగ్ అవార్డ్
రత్నపూరి ఎడ్యుకేషన్
ఓబుల్ రెడ్డి స్కూల్
రైల్వే స్టేషన్ క్యాటగిరి.
కాచిగూడ రైల్వే స్టేషన్.
హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి)
మంచిర్యాల రైల్వే స్టేషన్ (గోల్డ్ అవార్డ్)
అర్బన్ లోకల్ బాడీ సెక్టర్
హైదరాబాద్ మున్సిపాలిటీ
రామగుండం మున్సిపాలిటీ కార్పొరేషన్
ట్రాన్స్ పోర్ట్
గోదావరి ఖని బస్ డిపో
సత్తుపల్లి డిపో (గోల్డ్)
ఎక్సలెన్స్
జీఎంఆర్ (ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్)

- Advertisement -