బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే.. అతిథులు వీరే..

62

బిగ్‌బాస్‌ తెలుగు 5 సీజన్‌కు చివరి దశకి చేరుకుంది. ట్రోఫీ ఎవరి వశం అవుతుందనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. డిసెంబర్ 19 ఆదివారం సాయత్రం ఏకంగా నాలుగు గంటల పాటు ఈ భారీ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఇప్పటికే గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ను కనీవినీ ఎరగని రీతిలో ప్లాన్‌ చేశారు నిర్వాహకులు. టాలీవుడ్‌ నుంచి స్టార్‌ సెలబ్రిటీలను స్పెషల్‌ గెస్టులుగా తీసుకొస్తుండటంతో పాటు బాలీవుడ్‌ స్టార్లను సైతం రంగంలోకి దింపారు. ఇక హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్ల డ్యాన్సులు, హంగామా ఉండనే ఉంటుంది.

ఈ సారి వరస గెస్ట్‌లతో ఫినాలే స్టేజ్ దద్దరిల్లిపోయినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే బిగ్ బాస్ 2 తెలుగు హోస్ట్ చేసిన నాని మరోసారి స్టేజీపైకి వచ్చాడు. ఆయన నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన టీమ్‌తో కలిసి నేచరల్ స్టార్ నాని మరోసారి బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేసాడని తెలుస్తుంది. సాయి పల్లవితో కలిసి వచ్చిన నేచరల్ స్టార్ నాని తనదైన హోస్టింగ్ స్టైల్‌లోనే హౌస్ మేట్స్‌ను పలకరించి గట్టిగానే పంచులు కూడా వేసాడు. నాగార్జునతో కలిసి చేసిన ఫన్ ఎపిసోడ్‌కి హైలెట్ కానుంది. ఇద్దరూ గతంతోనే దేవదాస్ సినిమాలో కలిసి నటించారు. ఇక ఫినాలే స్టేజీపై డాన్సులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.

ఈ ఫినాలేలో లహరి షారి, హమీదా, ఆర్జే కాజల్, ఉమాదేవి, సరయు డాన్సులు చేసి అలరించబోతున్నారు. అలాగే యాంకర్ రవి , విశ్వ, నటరాజ్ మాస్టర్స్ కూడా అదిరిపోయే పెర్ఫామన్స్‌లు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత ప్రత్యేక అతిథులుగా 83 సినిమా టీమ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే, హీరో జీవాలు బిగ్ బాస్ స్టేజ్‌పై కాసేపు సందడి చేసినట్లు తెలుస్తుంది. వీళ్ల రాకతో అంతా ఒక్కసారిగా స్టన్ అయిపోయారు.

డిసెంబర్ 24న 83 సినిమా విడుదల కానుంది. దాంతో బిగ్ బాస్ స్టేజ్‌ను తమ సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నారు. ఇక చివరగా ఫినాలే స్టేజ్ పైకి టాప్ 2 కంటెస్టెంట్స్‌ను తీసుకొచ్చే బాధ్యత రాజమౌళి అండ్ టీమ్ తీసుకున్నారు. రామ్ చరణ్, అలియా భట్, రాజమౌళి ఈ షో చివర్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయబోతున్నారు. మొత్తానికి 4 గంటల పాటు సాగే ఈ మారథాన్ ఎపిసోడ్ అంగరంగ వైభవంగానే కాకుండా ఆసక్తికరంగానూ ఉండబోతుంది.