వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త‌: గ‌వ‌ర్న‌ర్

137
Assembly Budget Session
- Advertisement -

వ్య‌వ‌సాయ రంగానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్రాధాన్య‌త‌ను ఇచ్చిందన్నారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సుందర్‌ రాజన్‌. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సందర్భంగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప్ర‌సంగించారు.. రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ రంగం కోసం, రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందన్నారు. రైతు భీమా కింద చ‌నిపోయిన రైతు కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల బీమా ఇస్తున్నామ‌ని తెలిపారు. రైతుబంధు ప‌థ‌కం కింద ఎక‌రాకు రూ. 10 వేల చొప్పున ఇస్తున్నామ‌ని గవర్నర్‌ అన్నారు. రుణాల కింద వ్య‌వ‌సాయ ప‌రికరాల‌ను అందించి రైతుల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

ప‌త్తి సాగులో తెలంగాణ అద్భుత‌మైన రికార్డును సృష్టించింది. ప‌త్తి సాగులో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింద‌న్నారు. గోడౌన్‌ల‌ను కూడా పెంచామ‌న్నారు. వ్య‌వ‌సాయ రంగంలో ఎన్నో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకొచ్చి, అద్భుతాలు సృష్టిస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో 2.10 కోట్ల ఎక‌రాలు సాగులో ఉన్నాయ‌న్నారు. 2020-21 ఏడాదిలో 1.04 కోట్ల ఎక‌రాల్లో వ‌రి ధాన్యాన్ని సాగు చేశార‌న్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింద‌న్నారు గవర్నర్‌ తమిళిసై.

- Advertisement -