యాదాద్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉగ్రనరసింహుని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు గవర్నర్ నరసింహన్ దంపతులు యాదాద్రికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. కల్యాణ వేడుకల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఏడవ రోజు రాత్రు అశ్వవాహనసేవలో బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు నరసింహుడు…ఆలయంలో నయన మనోహరంగా స్వామివారు అశ్వవాహన సేవలో ఊరేగుతూ భక్తులను పరవజీంపచేశారు. లోక కల్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు ఉపదేశించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
వజ్ర వైఢూర్యాల ధరించిన స్వామివారు ఆలయ తిరువీధులో ఊరేగుతూ దగదగ మెరిసిపోయారు.వేద మంత్రలు,వేదపారాయణలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామి వారి ఊరేగింపు సేవ పై ఊరేగారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నర్సింహమూర్తితో పాటు ,యాదాద్రి జిల్లా కలెక్టర్, అణితరంచంద్రన్,యాదాద్రి ఏసీపీ, మనోహరెడ్డి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.