- Advertisement -
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(85) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో వేదాంత ఆస్పత్రిలో చేరిన ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. గవర్నర్ టాండన్ మృతిపట్ల మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన టాండన్…రెండు నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జూన్ 11న జ్వరం, మూత్ర సంబంధ సమస్యలతో ఉత్తరప్రదేశ్ లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. నాటి నుంచి మేదాంత దవాఖానలోనే లాల్జీ టాండన్ చికిత్స పొందుతున్నారు. జూన్ 30న, ఈ నెల 16న కూడా ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే పరిస్ధితి మరింత విషమించడంతో ఇవాళ ఉదయం కన్నుమూశారు.
- Advertisement -