ఇవాళ రాజ్ భవన్‌లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ బ్రాంజ్ మెడలిస్ట్, అర్జునా అవార్డ్ గ్రహీత సాయి ప్రణీత్‌ను గవర్నర్ నరసింహన్ దంపతులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి కోచ్ పుల్లెల గోపిచంద్ హాజరైయ్యారు.
ఈ సంర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. వరల్డ్ ఛాంపియన్ షిప్ బ్రాంజ్ మెడల్ సాదించిన సాయి ప్రణీత్ కు శుభాకాంక్షలు.36 ఏళ్ళ తర్వాత వరల్డ్ చాంపియన్ షిప్ మెడల్ సాదించడం రాష్ట్రానికే గర్వకారణం.
కోచ్ గోపిచంద్ ఆధ్వర్యంలో సాయి ప్రణీత్ రాటు దేలాడు.భవిష్యత్‌లో సాయి ప్రణీత్ మరిన్ని పతకాలు సాధించాలి.వచ్చే ఒలింపిక్స్‌లో సాయి ప్రణీత్ గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటున్నాను అని గవర్నర్ నరసింహన్ అన్నారు.
పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ.. సాయి ప్రణీత్ 36 ఏళ్ల తర్వాత బ్రాంజ్ మెడల్ నెగ్గడం సంతోషంగా ఉంది.వచ్చే ఒలింపిక్స్ లో బాడ్మింటన్ ప్లేయర్లు రాణించాలని కోరుకుంటున్నాను.సాయి ప్రణీత్ కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను ఎదుగుతాడు అని గోపీచంచ్ అన్నారు. నా సక్సెస్‌లో నా గ్రాండ్ పేరేట్స్ పాత్ర ఎంతో ఉంది. వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నానని ఈ సందర్భంగా సాయి ప్రణీత్ తెలపాడు.