71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో అల్పాహార విందునిచ్చారు. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వీఐపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరుకాగా వీరికి గవర్నర్ దంపతులు సాదరంగా స్వాగతం పలికారు.
గవర్నర్ అల్పాహార విందుకు తొలిసారి హాజరైన జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ విందులో మాజీ గవర్నర్ రోశయ్య, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రులు కేటీఆర్,కడియం,నాయిని,జగదీశ్ రెడ్డి ఎంపీలు కేశవరావు, డీఎస్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు,కాంగ్రెస్ నేత జానారెడ్డి, ఉత్తమ్, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తెలంగాణ మాజీ సీఎస్ రాజీవ్ శర్మ, తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్,వీవీఎస్ లక్ష్మణ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.