ప్రముఖ రాజకీయ వేత్త తలసాని శ్రీనివాస యాదవ్ పై నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా కేసును ఎసిబి కి అప్పగించడాన్ని యాదవ సంఘాల జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఏవైనా ఆరోపణలు, అనుమానాలు ఉంటే మొదట శాఖా పరమైన దర్యాప్తు జరపాలి. కానీ ఏ ఆధారాలు లేకుండా ఏకంగా ఎసిబి దర్యాప్తు నకు ఆదేశించడం అంటే రాజకీయంగా కక్ష్య సాధింపు లకు పాల్పడటమే అని ఆయన ఆరోపించారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ తలపండిన రాజకీయ వేత్త. సమర్థవంతమైన మంత్రిగా ప్రజల గౌరవాభిమానాలు పొందారు. బడుగు వర్గాల ప్రజలకు ఆరాధ్యుడు. అంతటి నాయుడి పై వేధింపులకు దిగడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమని గోసుల విమర్శించారు. బడుగు వర్గాల నాయకులను వేధించి అణగ దొక్కాలనే కుట్రలో భాగంగా నే తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసును ఎసిబి అప్పగించారనేది స్పష్టం అని ఆయన అన్నారు.తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వేధిస్తే బలహీన వర్గాల ప్రజలు తీవ్రంగా స్పందిస్తారని, ఈ కుట్రలను తిప్పి కొడతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని గోసుల శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
Also Read:త్రివిక్రమ్ తో సినిమా.. కష్టమేనా?