ప్రియాంక వంటను కుక్కల తిండితో పోల్చాడు.. !

193
gordon-ramsay-insults-priyanka-chopras-khichdi
- Advertisement -

ప్రియాంక చోప్రా.. పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌లో సత్తాచాటిన ఈ బ్యూటీ హలీవుడ్‌లో సైతం పాగావేసింది. తన అందచందాలను ఆరబోస్తోంది. ఏ మాత్రం మొహమాటలకు పోకుండా క్లీవెజ్‌ షోను ప్రదర్శిస్తోంది. అందాల ప్రదర్శనలో లేటెస్ట్ ట్రెండ్‌ను సెట్ చేస్తూ ముందుకు సాగుతున్న ప్రియాంక క్వాంటికో సిరీస్‌తో తెగ పాపులరైపోయింది. హాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తుండడంతో అమెరికాలోనే ప్రియాంక చోప్రా ఉన్న సంగతి తెలిసిందే. ప్రియాంక తాజాగా ఓ టాక్ షోలో పాల్గొంది. గోర్డాన్ రామ్సే అనే బ్రిటీష్‌ సెలబ్రెటీ చెఫ్ టాక్ షోలో ప్రియాంక సరదాగా చేసిన వంటకాలపై వెటకారంగా పంచ్ వేశాడు. టాక్ షోలో భాగంగా ప్రియాంక కిచిడి, చికెన్ సూప్ చేసి ఆడియెన్స్ కు చూపించింది.

priynaka-ramsay1

ఈ షోలో ప్రముఖ హీరోయిన్స్ స్వయంగా చేసిన వంటకాలపై జడ్జ్‌మెంట్ ఇవ్వాల్సిందిగా హోస్ట్ ఆండీ కొహెన్, రామ్‌సేను కోరాడు. ఈ క్రమంలో ప్రియాంక వండిన వంటకం గురించి ప్రశ్న వేయగా ఏమాత్రం సమయం తీసుకోకుండా టకీమని సమాధానం చెప్పాడు. ఇదీ కుక్కల కోసం వండిన సాయంకాలం భోజనం అని అనేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మిగతావారి వంటకాలపై సరిగానే మాట్లాడిన రామ్‌సే ప్రియాంక వంటకంపైనే ఇలా వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రియాంక ఓ సెలబ్రెటీనే అన్న కనీస జ్ఞానం లేకుండా ఆమె వంటపై లైవ్ లో కామెంట్ చేసిన రామ్సేపై ప్రియాంక అభిమానులు మండిపడుతున్నారు. అయితే దీనిపై ప్రియాంక మాత్రం ఏమీ స్పందించలేదు.

- Advertisement -