“తోలుబొమ్మలాట” గొప్పదిరా మనిషి పుట్టుక సాంగ్

163
Tolubommalata

సీనియర్ నటుడు డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరెక్కుతున్న సినిమా తోలుబొమ్మలాట. విశ్వనాధ్ మాగంటి దర్శకత్వం వహించగా ఐశ్వర్య మాగంటి సమర్పణలో, సుమ దుర్గా క్రియేషన్స్ బ్యానర్‌పై.. మాగంటి దుర్గా ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటివలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

తాజాగా ఈమూవీలోని గొప్పదిరా మనిషి పుట్టుక అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. కనుమరుగైపోతున్న మానవ సంబంధాల యెుక్క గొప్పతనాన్ని తెలిపేలా ఈసాంగ్ ను అద్భుతంగా రాశారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిచంగా చైతన్య ప్రసాద్ లిరిక్స్ రాశారు. సంగీత, విశ్వంత్, వెన్నెల కిషోర్, ధనరాజ్, నర్రా శ్రీను, దేవీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.