టాలీవుడ్ హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘సీటీమార్’. ఈ చిత్రం దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్‌లో రూపొందుతోంది. ఈమూవీ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నా ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో విడుదలకు సిద్ధంచేస్తున్నారు దర్శకనిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉగాదికి మూవీని రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రా టీమ్ ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా నటిస్తుండడంతో.. వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ ఇంట్రెంస్టింగ్ ఉంటుందట. హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.