మాచో హీరో గోపిచంద్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.. కొన్నాళ్ళుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్ ప్రస్తుతం పంతం అనే సినిమా చేస్తున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ నటిస్తోన్న 25వ చిత్రమిది. ఇందులో మెహరీన్ కథానాయికగా నటిస్తున్నారు. `బలుపు`, `పవర్`, `జై లవకుశ` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది.
అతను ఏం జాబ్ చేస్తాడో తెలియదు కాని.. ”లోపలున్నది బయటకు తీస్తాం.. బయటున్నది లోపలేస్తాం” అంటూ తన గురించి తానే చెప్పుకుంటాడు హీరో. అయితే ఆ క్రమంలో హ్యాకింగ్.. పోలీస్ తరహాలో చేజింగ్.. అదే విధంగా న్యాయం కోసం సొసైటీ కోసం పోరాడుతున్నాడు అని తెలుస్తోంది. ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగిన పంతం టీజర్లో.. ‘కరెంట్ ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ అంటూ ఓటేసిన జనాలు.. కరప్షన్ లేని సమాజాన్నిఎలా ఊహించుకుంటారు?’ అంటూ హీరో అడిగే సీన్ ఏదైతే ఉందో.. ఆ డైలాగ్ అదిరిపోయింది.
దర్శకుడు కొత్తే అయినా సినిమాను బాగానే తీర్చిదిద్దాడు. చూస్తుంటే ఒక సోషియో పొలిటికల్ డ్రామాగా ఉన్న ఈ సినిమాకు గోపిసుందర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. అలాగే ప్రసాద్ మురెళ్ల కెమెరె వర్క్ కూడా అదిరిపోయింది. మొత్తానికి ఈసారి గోపిచంద్ పంతం పట్టి మరీ హిట్టు కొట్టేస్తాడేమో అనిపిస్తోంది. వచ్చే నెలలో సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.