ఆత్మహత్యే శరణ్యం.. ఆఫీసర్ డిస్టిబ్యూటర్..

171

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆఫీసర్. జూన్ 1న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈ సినిమా ఏపీ రైట్స్ కొనుగోలు చేసిన సుబ్యహ్మణ్యం అనే వ్యక్తి మాత్రం నాకు ఆత్మహత్యే శరణ్యమంటున్నాడు. ఆఫీసర్ సినిమా షూటింగ్ సమయంలో రామ్ గోపాల్ వర్మకి తాను రూ.1.30 కోట్ల పైనాన్స్ ఇచ్చానని, సినిమా పూర్తి అయిన డబ్బులు తిరిగి ఇస్తానన్న వర్మ.. మళ్లీ డబ్బులు అడిగితే ఇవ్వనని కావాలంటే కోర్టు వెళ్లు అంటూ బెదిరించాడని వాపోయాడు.

Nagarjuna officer-movie

ఇక కోర్టు, కేసు అంటూ తిరిగితే సమయం పడుతుందన్న ఉద్దేశ్యంతో, ఆఫీసర్ గోదావరి రైట్స్ ఇవ్వాలని అడిగాను. కానీ కేవలం గోదావరి రైట్స్ ఇచ్చే ఉద్దేశ్యం లేదని వర్మ చెప్పడంతో గత్యంతరం లేక ఆఫీసర్ రైట్స్‏ని తాను మరో రూ.3.50 కోట్లు చెల్లించి సినిమా విడుదల చేశానని. లాభాలు వస్తాయని భావించాను. కానీ మొదటి షో నుంచి ఫ్లాప్ టాక్ రావడంతో సాధారణ కలెక్షన్లు కూడా రాలేవని చెప్పుకొచ్చారు. ఆఫీసర్ సినిమా భారీ నష్టాలు మిగిల్చిందని, తనకు ఆత్మహత్య తప్ప వేరు దారి కనిపించడం లేదని చెప్పారు. మరి సుబ్రహ్మణ్యం నష్టాలకు నాగార్జున ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మరోవైపు నాగ్, వర్మ కాంబో‏లో వచ్చిన శివ సినిమా అప్పట్లో సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. శివ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు వర్మ. అదే తరహాలో ఆఫీసర్‏తో భారీ విజయాన్ని అందుకోవాలనుకున్న వర్శ ఆశలు ఆవిరయ్యాయి. ముంబై మాఫీయా నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకలేకపోయింది.