గోపీచంద్ మలినేని ‘వీరసింహారెడ్డి’తో తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అనుకున్నాడు. ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నెక్స్ట్ హీరో ఎవరు ? అనే డిస్కషన్ నడుస్తుంది. అయితే తాజాగా తన రాబోయే సినిమా గురించి రెస్పాండ్ అయాడు గోపీచంద్. ప్రభాస్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నారని వినిపిస్తుంది. నిజమేనా ? అనే ప్రశ్న కు సమాధానం చెప్పాడు.
“అవును, నేను ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్న మాట నిజమే. అలాగే ఇతర హీరోలతో కూడా చర్చలు జరుపుతున్నాను కానీ ప్రస్తుతానికి ఏదీ కన్ఫర్మ్ కాలేదు. కొన్ని రోజులు విరామం తీసుకుని, తర్వాత నా తదుపరి చిత్రానికి సంబంధించిన పనులు ప్రారంభిస్తాను’’ అని గోపీచంద్ అన్నారు.
నిర్మాత మొదట తన తదుపరి స్క్రిప్ట్‌ను ఖరారు చేయాలని భావిస్తున్నానని, ఆ తర్వాతే హీరో గురించి ఆలోచించడం ప్రారంభిస్తానని చెప్పాడు. సో ప్రభాస్ తో అయితే చర్చలు నడుస్తున్నట్టు గోపిచంద్ చెప్పాడు సో ఈ కాంబో లో మూవీ వస్తుందా రాదా చూడాలి.
ఇవి కూడా చదవండి..