మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `చాణక్య`. తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటోంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం నేతృత్వాన ఇటలీ, మిలాన్‌లో పాటలను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటల చిత్రీకరణ షూటింగ్ విశేషాలను అక్కడి లోకల్ ఎలక్ట్రానిక్ మీడియా స్పెషల్‌గా టెలికాస్ట్ చేయడం విశేషం. మెహరీన్ హీరోయిన్గా నటిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్. నటీనటులు: గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు
సాంకేతిక వర్గం: కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు,ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి,కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర,మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్,సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి,రైటర్: అబ్బూరి రవి,ఆర్ట్: రమణ వంక,కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్,పి.ఆర్.ఒ: వంశీ శేఖర్