ఓటీటీలోకి గోపిచంద్ భీమా!

27
- Advertisement -

ఏ హర్ష దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం భీమా. మార్చి 8న శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో సక్సెస్‌ను అందుకున్నారు గోపిచంద్. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించగా బస్రూర్ సంగీతం అందించారు.

గోపిచంద్ సరసన ప్రియా భవానీ శంకర్ , మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది.ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఏప్రిల్ 5 నుండి స్ట్రీమింగ్‌ కానుంది.

కర్ణాటకలోని పరశురామ క్షేత్రంగా వెల‌సిన‌ మహేంద్రగిరి ఆనే ప్రాంతంలో ప‌ర‌శురాముడు ప్ర‌తిష్టించిన మ‌హిమ గ‌ల శివాల‌యం ఉంటుంది. ఎవ‌రైనా కోరిక‌లు తీర‌కుండా చ‌నిపోయిన వారి ఆత్మ‌ల‌ను ఆవ‌హింప‌జేసే ప్ర‌త్యేక‌త దానికి ఉంటుంది. ఆ ఊరికి ఎస్సైగా భీమా (గోపీచంద్) వ‌స్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్న కథతో తెరకెక్కించారు.

Also Read:ప్రధాని మోడీతో బిల్ గేట్స్

- Advertisement -