‘విశ్వం’…కంప్లీట్ ఫ్యామిలీ,దసరా మూవీ

9
- Advertisement -

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల బ్లాక్ బస్టర్ దసరా ఎంటర్ టైనర్ ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌ పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ హైబడ్జెట్ తో నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. దసరా కానుకగా శుక్రవారం (అక్టోబర్ 11) వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అందరికీ దసరా శుభాకాంక్షలు. ‘విశ్వం’మూవీని మేము ఏదైతే నమ్మమో ఈరోజు ఆడియన్స్ మాకు అంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు. కామెడీ, మదర్ ఎమోషన్ ,ఫాదర్ ఎమోషన్, యాక్షన్ సీక్వెన్స్.. ప్రతి ఎలిమెంట్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫాన్స్ ఫోన్ చేసి ఎక్స్ట్రార్డినరీ, చాలా బాగుందని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ సో మచ్. ఇంకా చూడని వాళ్ళు తప్పకుండ చూడండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంత మంచి హిట్ ఇచ్చిన శ్రీనువైట్ల గారికి థాంక్ యూ. ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. దసరా మూవీ. ఫ్యామిలీతో కలిసి చూడండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు

డైరెక్టర్ శ్రీనువైట్ల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విశ్వం ఈరోజు రిలీజ్ అయింది. నిన్న నైట్ షోస్ లండన్ లో పడ్డాయి. ఆ టైం నుంచి నాకు వరుసగా కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి. చూసిన ఆడియన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఫీలవుతున్నారు. సినిమాని విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ రెస్పాన్స్ చాలా ఓవర్ వెల్మింగ్ గా ఉంది. మార్నింగ్ నుంచి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ , రిసెప్షన్ ఆనందంగా అనిపించింది. కథని, కామెడీని, అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. కామెడీని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నార. నా సినిమాల్లో ఎప్పుడూ జరగనిది ఈ సినిమాలో ఎమోషన్, సెంటిమెంట్ ని ఎక్కువగా రిసీవ్ చేసుకోవడం నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. అలాగే యాక్షన్, సాంగ్స్, సెంటిమెంట్ అన్ని చాలా బాగున్నాయి అంటున్నారు. ఆడియన్స్ థియేటర్స్ లో ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అన్ని చోట్ల నుంచి చెప్తున్నా కలెక్షన్స్ గురించి విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. చాలా పాజిటివ్ గా ఉంది. మేము అనుకున్న ఎపిసోడ్స్ అన్ని చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. అలాగే ట్రైన్ ఎపిసోడ్ బిగ్ టైం వర్క్ అవుట్ అయ్యింది. పృథ్వి నరేష్ గారి ట్రాక్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. అలానే వర్క్ అవుట్ అయ్యింది. హీరో చేసిన పర్ఫార్మెన్స్. యాక్షన్, సాంగ్స్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని ఎలెమెంట్స్ కి ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఒక్క సెకండ్ కూడా సినిమా బోర్ కొట్టలేదని చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. యూనిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నాము. ఈ విశ్వం ఇంకా పెద్ద స్థాయికి వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాను. ఇంత మంచి సక్సెస్ చేసిన ఆడియన్స్ కి థాంక్యూ వెరీ మచ్. మా టీంకి పేరుపేరునా ధన్యవాదాలు. ప్రొడ్యూసర్స్ వేణు గారు విశ్వ ప్రసాద్ గారు ఇచ్చిన సపోర్ట్ తో ఈ సినిమా ఇంత గ్రాండ్ గా తీయగలిగాను . ప్రేక్షకులు ఇంత బాగా రిసీవ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంద. పండక్కి ఇంత పెద్ద సినిమా అయినందుకు చాలా ఆనందంగా ఉంది. థాంక్యూ సో మచ్’ అన్నారు.

Also Read:అల్సర్ ఉందా.. అల్లంతో జాగ్రత్త!

హీరోయిన్ కావ్య కాపర్ మాట్లాడుతూ.. అందరికీ హ్యాపీ దసరా. విశ్వం నా కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా. సినిమా ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమ, ఇష్టానికి చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శ్రీనువైట్ల గారికి బిగ్ థ్యాంక్స్. శ్రీనుగారు ఈ సినిమాని మైండ్ బ్లోయింగ్ గా తీశారు. రియల్లీ హ్యాట్సాఫ్. గోపీచంద్ గారికి నేను బిగ్ ఫ్యాన్ ని. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, వాకింగ్ యాక్షన్ కి హాట్సాఫ్. ఇందులోనే మదర్ సెంటిమెంట్ కి నన్ను చాలా కదిలించింది. సినిమాలోని ఎంటర్టైన్మెంట్ ని అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ సో మచ్. విశ్వం సినిమాని సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్, మీడియా అందరికీ థాంక్యూ సో మచ్’ అన్నారు.

నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈరోజు మా అందరికీ చాలా పెద్ద పండగలా ఉంది. సినిమాకి వరల్డ్ వైడ్ ఓవర్ వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమాని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీను గారి కామెడీ అద్భుతంగా వర్క్ అవుట్ అయిందని చెప్తున్నారు. అలాగే హీరో గారి పర్ఫార్మెన్స్ కి చాలా అద్భుతమైన అప్రిషియేషన్స్ వస్తున్నాయి. మదర్ ఎమోషన్ కి చాలామంది కనెక్ట్ అవుతున్నారు. ఇంత మంచి సూపర్ హిట్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ. శ్రీను గారికి, గోపీ గారికి థాంక్యూ. ఆడియన్స్ సపోర్టు ఇలానే ఉండాలి. అందరికీ దసరా శుభాకాంక్షలు’ తెలిపారు.

- Advertisement -