విశ్వం..100% ఎంటర్‌టైన్ చేస్తుంది

2
- Advertisement -

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.

గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాకి టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు. చాలా రిస్కీ ప్లేసెస్ లో ఈ సినిమాని షూట్ చేశాం. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈరోజు సినిమా ఇంత అద్భుతంగా వచ్చిందంటే వాళ్ళ హార్డ్ వర్క్ కే కారణం. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ సౌండింగ్ చాలా కొత్తగా ఉంది. ఎక్స్ ట్రార్డినరీ సాంగ్స్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇరగదీసాడు. తను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. గుహన్ గారితో ఎప్పటినుంచో వర్క్ చేయాలని అనుకున్నాం. ఈ సినిమాతో కుదిరింది. లొకేషన్స్, యాక్టర్స్ ని చాలా అందంగా చూపిస్తారు. ఎక్స్ ట్రార్డినరీ అవుట్ పుట్ ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ ఇద్దరికీ థాంక్స్ చెప్తున్నాను. విశ్వప్రసాద్ గారు ఈ సినిమాకి రావడం చాలా ప్లస్ అయింది. గోపి మోహన్ తో పాటు ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్ కి థాంక్యూ. గోపి మోహన్ గారు లక్ష్యం, లౌక్యం సినిమాలకి పని చేశారు. విశ్వం కూడా సేమ్ రేంజ్ ఆఫ్ హిట్ అవుతుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి సారీ చెప్పాలి( నవ్వుతూ) ఎందుకంటే యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ చూస్తున్నప్పుడు నాకు నవ్వు వచ్చేసింది. సీన్స్ అంత బాగా వచ్చినాయి. ప్రతి సీన్ చేసేటప్పుడు సెట్ లో నవ్వుకుంటూనే ఉన్నాం. సినిమాల్లో పని చేసిన ఆర్టిస్టులు అందరికీ థాంక్యూ. డైరెక్టర్ శ్రీను గారితో ఎప్పటినుంచో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఫంక్షన్ లో కలిసాం. అప్పటినుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఆయన స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. తన సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారో అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఆయన స్క్రిప్ట్ మీద దాదాపు 7 నెలలు పని చేశారు. ఆయన సీన్ చెప్పినప్పుడే చాలా అద్భుతంగా పెర్ఫాం చేస్తారు. ఆయన మార్క్ ప్రతి ఆర్టిస్ట్ లో కనిపిస్తుంది. ఆయన టైమింగ్ చాలా యూనిట్ గా ఉంటుంది. ఆయనతో జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. ఒక బ్రదర్ గా ఫీల్ అయ్యాను. ఆయన ఎక్స్ ట్రార్డినరీ పర్సన్. ఆర్టిస్ట్ ని కంఫర్ట్ జోన్ లోకి తీసుకువచ్చి తనకు కావాల్సింది తీసుకుంటారు. నేను చాలా సినిమాలు చేశాను. ఇంత కంఫర్ట్ ఎక్కడ ఫీల్ అవ్వలేదు. శ్రీను గారు చాలా యూనిక్ పర్సన్. కంటిన్యూస్ గా సినిమా మీదే వర్క్ చేస్తుంటారు. వేరే డైవర్షన్ ఉండదు. అక్టోబర్ 11న దసరాకి సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ నవ్వు ఆగదు. యాక్షన్, కామెడీ, ఫన్ ఎక్స్ ట్రార్డినరీగా వచ్చింది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక మాట చెప్పగలను. శ్రీనువైట్ల గారు ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్. థాంక్ యూ సో మచ్’ అన్నారు.

Also Read:ఓటీటీలోకి సుహాస్ ‘గొర్రె పురాణం’!

డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విశ్వం నిజంగా బ్యూటిఫుల్ జర్నీ. ఈ బ్యూటిఫుల్ జర్నీలో నా బెస్ట్ కో ప్యాసింజర్ గోపీచంద్ గారు. మా ఇద్దరితో ఈ జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత వేణు గారు వచ్చారు. తర్వాత విశ్వ ప్రసాద్ గారు వచ్చారు. ఈ జర్నీ చాలా ఎంజాయ్ చేశాను. గోపి మోహన్, భాను, నందు, ప్రవీణ్ వర్మ ఈ నలుగురు నేను అనుకున్న కథని అనుకున్నట్లు రావడానికి చాలా కష్టపడి పని చేశారు. ఈ సినిమాలో టెక్నీషియన్స్ అంతా నా మీద ఇష్టంతో ప్రేమతో పని చేశారు. ఈ సినిమాని నేను అనుకున్నది అనుకున్నట్లు తీయగలిగాను. ఐ యాం 100% కాన్ఫిడెంట్ ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. రెండున్నర గంటలో ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. ఎంగేజింగ్ గా హిలేరియస్ గా వుంటుంది. చేతన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాకి రీ రికార్డింగ్ చేయడం చాలా కష్టం. తను ఎఫర్ట్ లెస్ గా చాలా బాగా చేశాడు. ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్నది అనుకున్నట్లుగా తీయడానికి సపోర్ట్ చేసిన విశ్వ ప్రసాద్ గారికి వేణుగారికి థాంక్స్ చెప్తున్నాను. గుహన్ నాకు ఒక యంగర్ బ్రదర్ లా ఉంటూ చాలా సపోర్ట్ చేశారు. ఎడిటర్ అమర్ ఈ సినిమా హిట్ కావాలని అనుక్షణం పనిచేసాడు. కావ్య పర్ఫామెన్స్ తో పాటు డాన్సులు కూడా చాలా ఎనర్జిటిక్ గా చేసింది. అనీషా, ప్రగతి గారు, నరేష్ గారు, సునీల్, వెన్నెల, కిషోర్, శ్రీనివాస్ రె,డ్డి శ్రీకాంత్ అయ్యంగర్, రాహుల్ రామకృష్ణ.. యాక్టర్స్ అందరు కూడా ఎంతో ఇష్టపడి చాలా ప్రేమతో పనిచేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఏ సినిమా అయినా డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్లు తీయాలంటే హీరో సపోర్టు ఉండాలి. గోపి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చాడు.ఆయన వల్లే నేను అనుకున్నది అనుకున్నట్లుగా తీయగలిగాను. డెఫినెట్ గా ఈ సినిమా నాకు గోపికి చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ హిట్ తో దసరాని చాలా ఎంజాయ్ చేయబోతున్నాం. అందరికీ హ్యాపీ దసరా. థాంక్యూ సో మచ్’ అన్నారు

- Advertisement -