గూగుల్‌తో ఏపీ ఎంవోయూ

9
- Advertisement -

గూగుల్‌తో చారిత్రక ఒప్పందం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. ‘భారత్ ఏఐ శక్తి’ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు గూగుల్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రతిపాదనపై ఒప్పందం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ అడుగుపెట్టింది అన్నారు మంత్రి నారా లోకేశ్. టెక్ ప్రపంచంలో ఏపీకి ఇది చారిత్రాత్మక రోజు… గూగుల్ క్లౌడ్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది అన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లోకి కొత్త అధ్యాయం అన్నారు.

రూ.88,628CR(10 బి.డాలర్ల)తో గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌తో MOU కుదిరింది. ఢిల్లీలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, నిర్మలా సీతారామన్‌, మంత్రి లోకేశ్‌ సమక్షంలో MOUపై సంతకాలు చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి.

Also Read:రాజకీయ పార్టీల ప్రకటనలపై ఈసీ

- Advertisement -