గూగుల్‌లో లేఆఫ్‌..మాంద్యమే కారణమా!

35
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయంతో మల్టీ నేషనల్ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గూగుల్‌ కంపెనీ కూడా లేఆఫ్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12000వేల మంది ఉద్యోగులను తొలగించినట్టు గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్‌ ప్రకటించారు. ఈ మేరకు ట్వీటర్ ద్వారా ప్రకటించారు.

ప్రస్తుత ఉద్యోగులు ఉన్నారా అని తేల్చేందుకు పలు ఉత్పత్తి విభాగాల్లో కఠిన సమీక్ష జరిపామని ఉద్యోగులకు రాసిని లేఖలో సుందర్ పిచాయ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాస్ లేఆఫ్‌లో భాగంగా కంపెనీలో ఆరు శాతం ఉద్యోగులను విధుల నుంచి తొలిగించినట్టు తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారందరికి తగిన పరిహార ప్యాకేజ్‌ చెల్లిస్తామన్నారు.

16వారాల వేతనంతో పాటు ప్రతి ఏడాదికి రెండు వారాల శాలరీతో పాటు పలు ప్రయోజనాలను ప్యాకేజ్‌లో ఉంటాయని పేర్కొన్నారు. అమెరికా వెలుపల పనిచేసే గూగుల్‌ ఉద్యోగులకు కాంట్రాక్టులకు అనుగుణంగా బెనిఫిట్స్‌ ఉంటాయని కంపెనీ పేర్కొంది. గతంలో ట్విట్టర్ మెటా అమెజాన్‌ వంటి టెక్ దిగ్గజాలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు.

ఇవి కూడా చదవండి…

వెల్‌కమ్‌ ఏడబ్ల్యూఎస్:కేటీఆర్‌

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ విస్తరణ…

150కోట్లతో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌..

- Advertisement -