సమంత వదిలిన ‘గూఢచారి’ టీజర్..

200

టాలీవుడ్‌లో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అడివి శేష్. ఆయన హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో ‘గూఢచారి’ సినిమా రూపొందింది. ఈ సినిమాలో అడివి శేష్ సరసన కథానాయికగా శోభిత ధూళిపాళ నటించింది.ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ ,విస్టా డ్రీమ్ మర్చంట్స్ ,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సమంత చేతుల మీదుగా విడుదల చేశారు చిత్ర యూనిట్.

Goodachari 4K Teaser

ఇటీవల చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ మూవీ చిత్రీకరణ అధిక భాగం అమెరికా, హిమాచల్ ప్రదేశ్, పుణే, న్యూ ఢిల్లీ, చిట్టగాంగ్, హైదరాబాద్, వైజాగ్ లలో జరిగింది. సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాతో వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వెన్నెల కిషోర్, అనిష్ కురివెళ్ల, రాకేష్ వర్రీ తదితరులు నటిస్తున్నారు.

Goodachari 4K Teaser

అడివి శేష్ ఏజెంట్ పాత్రలో అదిరిందని ఆకట్లుకున్నాడు. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చగా ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఈ సినిమాకి శనీల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు. ఆగస్ట్ 3న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

Goodachari 4K Teaser | Adivi Sesh | Sobhita Dhulipala | Prakash Raj | Sashi Kiran Tikka