మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. లోకష్ రాహుల్(9) పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. అయితే మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్,పుజారాతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
మయాంక్ రెండో టెస్టులోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.మెల్‌బోర్న్‌లో జరిగిన మూడవ టెస్టులోనూ మయాంక్ హఫ్ సెంచరీ చేసి అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మయాంక్ 96 బంతుల్లో 7 బౌండరీలతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. మయాంక్ 112 బంతుల్లో 77 పరుగులు చేసి లయన్ బౌలింగ్‌లో వెనుదిరిగారు.
అయితే మరో ఎండ్‌లో భారత్ వాల్ పుజారా మరోసారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టీ బ్రేక్ సమయానికి పుజారా(61),కోహ్లీ(23) పరుగులతో క్రీజులో ఉన్నారు. 52 ఓవర్లలో 2 వికెట్లు కొల్పోయి 177 పరుగులు చేసింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.
One for the occasion – Going all Pink Mr. Kohli #TeamIndia #AUSvsIND pic.twitter.com/dfVnQ65XYw
— BCCI (@BCCI) January 3, 2019