పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి..

273
Green Challenge
- Advertisement -

తమ పెళ్లి రోజు సందర్భంగా తాడగొండ గ్రామ సర్పంచ్ చిందం రమేష్ మొక్కలు నాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తాడగొండ గ్రామంలో తమ ఇంటి ఆవరణలో ఆయన సతీమణితో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తమ పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -