‘వీరయ్య’ పూనకాలు తెప్పించాడా ?

45
Megastar Chiranjeevi Waltair Veerayya trailer
Megastar Chiranjeevi Waltair Veerayya trailer
- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి , మాస్ మహారాజా రవితేజ కాంబోలో డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ‘వాల్తేరు వీరయ్య’ భారీ అంచనాల నడుమ ఈరోజే ప్రేక్షకుల ముందు కొచ్చింది. మరి వీరయ్య గా సంక్రాంతి రేస్ లో నిలిచిన మెగా స్టార్ పూనకాలు తెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడా ? చూద్దాం.

బాబీ మెగా స్టార్ కి వీరాభిమాని, అభిమానులు చిరుని ఎలా చూడాలనుకుంటున్నారో ఒక అభిమానిగా బాబీ కి బాగా తెలుసు. అందుకే చిరంజీవి కేరెక్టర్ మీద ప్రత్యేక శ్రద్ద పెట్టాడు. దీంతో వింటేజ్ లుక్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు చిరు. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్ ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పవచ్చు. అలాగే ఇంటర్వల్ బ్యాంగ్ ఎపిసోడ్ పూనకాలు తెప్పించడం ఖాయం. చిరు ప్రీవీయస్ సినిమాల్లో మిస్ అవుతున్న కామెడీ టైమింగ్ ఇందులో పుష్కలంగా వాడుకున్నాడు బాబీ. కాకపోతే హిలేరియస్ కామెడీ ప్లాన్ చేసుకోలేదు.

ఇక బాబీ కథ -కథనం మీద మాత్రం ఫోకస్ పెట్టలేకపోయాడనిపించింది. బాబీ రాసుకున్న కథ తో పాటు సీనియర్ రైటర్ కోనా వెంకట్ అలాగే చక్రవర్తి రాసిన స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకోలేదు. స్టోరీ -స్క్రీన్ ప్లే పరమ రొటీన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమాలో గూస్ బంప్స్ ఇచ్చే అదే మేకర్స్ చెప్పినట్టు పూనకాలు లోడ్ అయ్యే ఎపిసోడ్స్ పెద్దగా లేకపోవడం పెద్ద మైనస్. ఇక దేవి మ్యూజిక్ సినిమాకి కలిసొచ్చే అంశం. సాంగ్స్ తో పాటు కొన్ని సందర్భాలలో వచ్చే నేపథ్య సంగీతం బాగుంది.

ఫస్ట్ హాఫ్ లో సాగే మలేషియా సన్నివేశాలు కాస్త బోర్ కొట్టిస్తాయి. ఇక సెకండాఫ్ లో రవితేజ వాడుకొని బండి లాగించేశాడు బాబీ. ముఖ్యంగా చిరు -రవితేజ మధ్య ఎమోషన్ బ్లాక్ వర్కవుట్ అవ్వలేదు. దీంతో సినిమాలో ఎమోషన్ పండలేదు. ప్రకాష్ రాజ్ విలనిజం , క్లైమాక్స్ కూడా రొటీన్ అనిపిస్తాయి. ఓవరాల్ గా మెగా ఫ్యాన్స్ ను ‘వీరయ్య’ మెప్పిస్తాడు. మిగతా వారిని కాస్త నిరాశ పరిచి థియేటర్స్ నుండి పంపిస్తారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -