పురుషోత్తముడు..టీజర్‌కి మంచి రెస్పాన్స్

13
- Advertisement -

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీ పురుషోత్తముడు. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన పురుషోత్తముడు సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – మా మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన మీడియా, గెస్టులకు థ్యాంక్స్. పురుషోత్తముడు మూవీ గురించి మాట్లాడాలంటే ముందు మా ప్రొడ్యూసర్ డా. రమేష్ గారి గురించి చెప్పాలి. ఆయన సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టి మూవీ బాగా వచ్చేలా చూసుకున్నారు. మా డైరెక్టర్ రామ్ భీమనతో నాకు మంచి అండర్ స్టాండింగ్ ఉంది. మేమిద్దరు ఒక్క చూపుతో సీన్ ఎలా ఉండాలో కన్వే చేసుకునేవాళ్లం. మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు. ఆయన రేపు పెద్ద డైరెక్టర్ అయ్యాక కూడా నాతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అందరూ బాగా వర్క్ చేశారు. జూన్ 6న పురుషోత్తముడు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక డేట్ అనౌన్స్ చేస్తాం. మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంకరేజ్ చేయండి అన్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -