మిరాయ్ భారీ అంచనాల నడుమ రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది. హను-మాన్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు.
బాక్సాఫీస్ వద్ద సినిమా ముందుగానే మైలురాళ్లు చేరుకోవడం ప్రారంభించింది. ఉత్తర అమెరికాలోనే ప్రీమియర్స్‌కి ముందే కలెక్షన్స్ $200K దాటాయి. పాజిటివ్ టాక్ రావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
దేశీయంగా కూడా హైప్ అంతే ఉత్సాహంగా ఉంది. తెలుగు రాష్ట్రాలు, ఉత్తర భారత ప్రేక్షకులు మొదటి రోజు మొదటి షోనే ఈ సినిమా చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సుమారు రూ. 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలో మేకర్స్ సాధించిన మిరాకిల్ ఏంటో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.
ప్రతినాయకుడిగా మంచు మనోజ్ నటించగా జయరాం, జగపతి బాబు, శ్రియ శరణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది.
Also Read:చిరుతో పూరి..!

