ఇట్లు అర్జున..అద్భుత రెస్పాన్స్!

1
- Advertisement -

కింగ్ నాగార్జున సమర్పణలో వచ్చిన లేటెస్ట్ హార్ట్‌బస్టర్ ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. దర్శకుడు వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.

సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నాకు చాలా నోస్టాల్జిక్ మూమెంట్. ఎందుకంటే ‘శివ’ సినిమా పూర్తయిన తర్వాత ఫస్ట్ కాపీని ఇక్కడే చూశాం. అందుకే దీనికి శివ థియేటర్ అని కూడా పేరు పెట్టాం. ముందుగా ఇట్లు అర్జున సినిమా టీమ్ అందరికీ అభినందనలు. ఈ సినిమాకు డీఓపీ రాజా కూడా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఈ సినిమా చూసే నా 100వ సినిమాకు తనను డీఓపీగా తీసుకున్నా, దర్శకుడు మహేష్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మాటలు రాని హీరోతో ఒక కథ చెప్పడం అంత ఈజీ కాదు. అలాంటి కథను చాలా అద్భుతంగా తీశాడు. యాక్షన్, సౌండ్.. ఇలా ప్రతి అంశాన్ని అద్భుతంగా డిజైన్ చేశారు. మహేష్‌కు చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుంది. వెంకీ ప్రొడక్షన్ ను అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. సినిమా చూసిన తర్వాత అనస్వరకు నేను ఫ్యాన్ అయిపోయాను. తను చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ అనీష్ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. తను నిజంగా సాధించాడు. చాలా మంచి క్యారెక్టర్‌ను పోషించాడు. అనీష్ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. రోజురోజుకీ వర్డ్ ఆఫ్ మౌత్ పెరుగుతోంది. నేను ఈ సినిమాను ప్రజెంట్ చేసినందుకు నా మాట నిలబెట్టారు. అనీష్ ఈ సినిమాతో హీరోగా పాస్ అయ్యాడు. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయం టీమ్ అందరికీ దక్కుతుంది. ఇంత మంచి హార్ట్‌బస్టర్ సక్సెస్ అందుకున్న అందరికీ కంగ్రాట్యులేషన్స్.

హీరో అనీష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీరందరూ ఇస్తున్న ప్రేమకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫస్ట్ హీరో మ్యూజిక్ . నేను ఈ కథ విన్నప్పుడే అదే నమ్మాను. ఈరోజు అందరూ తమన్ గారి మ్యూజిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన ఈ కథను, సినిమాను టీమ్ ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు. థియేటర్‌లో కూర్చొని నన్ను నేను చూసుకున్నప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎంతగానో ఎంజాయ్ చేశాను. వెంకీ గారు కథను నమ్మి నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నాను. అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎడిటింగ్ కూడా చాలా బాగుందని అంటున్నారు. అంత చక్కగా ఎడిట్ చేసిన కోటికి థాంక్యూ. అలాగే రాజాకు కూడా థాంక్యూ. తను అందరినీ సర్‌ప్రైజ్ చేసే విజువల్స్ ఇచ్చారు. కీర్తి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అనస్వరకు థాంక్యూ. ఇలాంటి కథ రాసి, నన్ను నమ్మి నాతో ప్రయాణించిన మా డైరెక్టర్ మహేష్ గారికి థాంక్యూ. క్లైమాక్స్‌లో అందరూ చప్పట్లు కొడుతుంటే తొలి సినిమా నటుడిగా నాకు ఎంతో ఆనందం కలిగింది. నా పెర్ఫార్మెన్స్‌కు ఎంత పేరు వచ్చినా, దానికి కారణం డైరెక్టర్ మహేష్ గారే. ఆయన దగ్గరుండి నన్ను ఎంతో ప్రోత్సహించి నటింపజేశారు. ఇంకా సినిమా చూడని వారు థియేటర్లకు వెళ్లి చూడండి. ఇది చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. యాక్షన్‌ను కూడా ఎంజాయ్ చేస్తారు. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నాగార్జున గారి సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ జర్నీలో మొదటి రోజు నుంచి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా బి.ఎం. సందీప్..

- Advertisement -