తాతల తండ్రుల కాలం నుంచి తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్ఏ లకు పే స్కేలు అమలు పరుస్తూ, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ఆదివారం నాడు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు సచివాలయంలో జీవో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు. రాష్ట్రంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటుపై ఉన్నతాధికారులతో నిన్న సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు.
61 ఏళ్ల లోపు ఉన్న 16758 వీఆర్‌ఏలను వాళ్ల విద్యార్హతల ఆధారంగా మూడు కేటగిరిలుగా విభజించారు.
₹ 19000 – 58850 పే స్కెలుతో 10 వ తరగతి వరకు లాస్ట్ గ్రేడ్ సర్వీస్ లో 10317 మందిని
₹ 22240 – 67300 పే స్కేలుతో ఇంటర్ చదివిన వాళ్లను రికార్డు అసిస్టెంట్లుగా 2761 మందిని
₹ 24280 – 72850 పే స్కెళుతో డిగ్రీ ఆపైన చదివిన వాళ్లను జూనియర్ అసిస్టెంట్లుగా 3680 మందిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు.
ఇక 2011 అక్టోబర్ 1 లో నియమించిన వీఆర్‌ఏల పదవీ విరమణ కోసం గరిష్ట వాయో పరిమితిని నిర్ణయించలేదు.
Also Read:BRO:ఆ 20 నిమిషాలే కీలకమా!
అలా ఒకవేళ 61 ఏళ్ల పైబడి ఇంకా వీఆర్‌ఏలుగా కొనసాగుతున్న 3797 మంది వారసులను వాళ్ల వాళ్ల విద్యార్హతల ఆధారంగా కంపాషనేట్ గ్రౌండ్స్ పై లాస్ట్ గ్రేడ్ సర్వీస్, రికార్డు అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టంట్ల కేటగిరీల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.విద్యార్హతలను బట్టి నాలుగు శాఖల్లో వీఆర్‌ఏలను సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.ఆమేరకు వీఆర్‌ఏల విద్యార్హతను బట్టి నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్, మిషన్‌భగీరథ శాఖల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.