తెలుగు ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్ తెలిపిన ఢిల్లీ!

142
rgi
- Advertisement -

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు గుడ్ న్యూస్ తెలిపింది ఢిల్లీ ప్రభుత్వం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయాలనే నిబంధనను ఎత్తేసింది ఢిల్లీ ప్రభుత్వం. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి వచ్చేవారు ఆర్టీపీసీఆర్ టెస్టు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది స్పైస్ జెట్.

స్పైస్ జెట్ చేసిన ట్వీట్ తో పాటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేసింది. ఢిల్లీకి వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దేశ రాజధాని ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎమ్ఏ) మే6న ఢిల్లీకి వచ్చే తెలుగు రాష్ట్ర ప్రయాణికులు.. 14రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా పాటించాలని ఆర్డర్ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -