నేటిరోజుల్లో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నా దాని ప్రకారం ప్రతి పది మందిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారట. రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గుల కారణంగా మధుమేహం వ్యాధి వస్తుంది. ఒక్కసారి ఈ షుగర్ బారిన పడితే దీని నుంచి బయటపడడం అంతా ఈజీ కాదు. మధుమేహం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఇక షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్లు ఇన్సులిన్ ఇంజక్షన్ కూడా తీసుకుంటారు. ఒక్కోసారి ఇంజక్షన్ తీసుకోవడం ఆలస్యమైనా అది పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇలాంటి సమయంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు డెన్మార్క్ కు చెందిన ఫార్మా కంపెనీ నోవో నోర్డిస్క్ గుడ్ న్యూస్ చెప్పింది.
రోజు కాకుండా వారానికోసారి ఇచ్చే ఇన్సులిన్ ఐకోడెక్ ను అభివృద్ధి చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ పర్మిషన్ పొందిన ఈ ఇంజెక్షన్..భారత్ లోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ పరిశీలనకు వచ్చింది. ఒకవేళ అనుమతులు లభించినట్లయితే త్వరలోనే భారత మార్కెట్లోకి ఐకోడెక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఐకోడెక్ ద్వారా వారానికి సరిపడే విధంగా ఇన్సులిన్ ను ఇచ్చినప్పుడు ఆ ఇన్సులిన్ అంతా రక్తంలోని ఆల్బుమిన్ అనే ప్రొటీన్ లో ఇన్ యాక్టివ్ స్టోరేజీలో ఉంటుందని ప్రతినిధులు తెలిపారు. సో షుగర్ సమస్యతో ఇన్సులిన్ తీసుకునే వారికి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
Also Read:Harishrao:మళ్లీ అధికారం బీఆర్ఎస్‌దే