‘రాజా సాబ్’..ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

10
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ “రాజా సాబ్”. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో “రాజా సాబ్” సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా టీజర్‌ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా మారుతీ సన్నిహితుడు,ఈ సినిమాకు సహా నిర్మాత కూడా అయినటువంటి మాస్ మూవీ మేకర్స్ నిర్మాత ఎస్ కె ఎన్ లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చారు.

మారుతీతో రీసెంట్ గానే మాట్లాడ్డం జరిగింది అని ప్రస్తుతం రాజా సాబ్ పనుల్లోనే బిజీగా ఉన్నారని రానున్న ఈ రెండు వారాల్లోనే టీజర్ రాబోతుంది అని అసలు విషయం రివీల్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Also Read:Rahul:జమ్మూకు రాహుల్ గాంధీ

- Advertisement -