హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త..

263
Metro Rail
- Advertisement -

గ్రేటర్ పరిధిలో మెట్రో ప్రయాణికులకు యాజమాన్యం శుభవార్త అందించింది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో గ‌త మార్చి 22న నిలిచిపోయిన హైద‌రాబాద్ మెట్రో రైలు సేవ‌లు తిరిగి సెప్టెంబర్ 7, 2020 న ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ఉదయం నుంచి ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైళ్ల సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన సేవలు రాత్రి 9.30 గంటల వరకు కొనసాగుతాయని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

ఎల్బీనగర్, అమీర్‌పేట, మియాపూర్, ఎంజీబీఎస్‌ టర్మినల్‌ స్టేషన్ల నుంచి రాత్రి 9.30 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరి.. రాత్రి 10.30 గంటలకు గమ్యం టెర్మినల్ స్టేషన్ కు చేరుకుంటుంది. అలాగే, మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైనప్పటికీ తెరుచుకోని ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి, భరత్‌నగర్‌ మెట్రో స్టేషన్లలో నేటి నుంచి తిరిగి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉండడంతో ఈ స్టేషన్లను ఇప్పటి వరకు మూసి ఉంచారు.

- Advertisement -